calender_icon.png 18 January, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి జిల్లాలో గవర్నర్ పర్యటన

26-08-2024 04:18:09 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 27, 29వ తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే నేడొక ప్రకటనలో తెలిపారు. గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ మంగళవారం ఉదయం 8.00 గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారని, అనంతరం ములుగు, వరంగల్, జనగాం జిల్లాల పర్యటనకు వెళతారని తెలిపారు.  తిరిగి 29వ తేదీ గురువారం నాడు మధ్యాహ్నం 2.20 గంటలకు కొలనుపాకలో జైనదేవాలయాన్ని, సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు. సాయంత్రం 3.00 గంటలకు బయలుదేరి 3.30.గంటలకు స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించుకుంటారని, సాయంత్రం 4.15 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులను కలుస్తారని, 5.15 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో రచయితలు, కళాకారులు, ప్రముఖులు, రాష్ట్ర జాతీయ అవార్డు గ్రహీతలను కలుస్తారని ఆయన ప్రకటనలో తెలిపారు.