హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న 'భూభారతి' బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ఆమోదించారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)కి గురువారం అందజేశారు. వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ భూ భారతి((Telangana Bhu Bharati Bill)) (భూమిలో హక్కుల రికార్డు) బిల్లు, 2024 కింద భూ పరిపాలన కోసం నిబంధనలను రూపొందించే ప్రక్రియను రెవెన్యూ శాఖ ప్రారంభించింది. రాష్ట్ర అసెంబ్లీ డిసెంబర్ 20న బిల్లును ఆమోదించింది. డిసెంబర్ 30న ఆమోదం పొందేందుకు ప్రభుత్వం దానిని గవర్నర్‌కు పంపింది.