నాగరికత ఉన్నంతకాలం పుస్తకాలుంటాయ్
పుస్తకాల్లో మజా ఉంటుంది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్: మానవ నాగరికత ఉన్నంతకాలం పుస్తకాలు ఉంటాయని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma) పేర్కొన్నారు. శనివారంనాడు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన(Hyderabad Book Fair)ను గవర్నర్ జిష్ణుదేవ్ సందర్శించారు. స్టాళ్లు కలియ తిరుగుతూ పుస్తకాలు పరిశీలించారు. పుస్తకాల్లో అనంతమైన జ్జానం ఉందన్నారు. ప్రస్తుతం ఆడియో పుస్తకాలు కూడా అందుబాటులోకి వచ్చాయని గవర్నర్ తెలిపారు. ఈ-బుక్స్(E-books) కంటే పుస్తకాల్లోనే మజా ఉంటుందన్న ఆయన పుస్తకం చదివితే నేరుగా రచయితతో మాట్లాడినట్టేనని తెలిపారు. యువతను పుస్తకాల వైపు పెద్దలు ప్రోత్సహించాలని కోరారు. శుభకార్యాల్లో పుస్తకాలను బహుమతులుగా ఇవ్వాలని తెలిపారు. రేపటితో హైదరాబాద్ లో పుస్తక ప్రదర్శన ముగియనుంది.