హైదరాబాద్: గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మతో హైకోర్టు సీజే జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1957 ఆగస్టు 15న జిష్ణుదేవ్ వర్మ జన్మించారు. రామజన్మభూమి ఉద్యమం సమయంలో ఆయన బీజేపీలో చేరారు. 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ పనిచేశారు.