calender_icon.png 27 January, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట

26-01-2025 02:05:08 PM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  గవర్నర్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం(Praja Prabhutvam) తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. వ్యవసాయం రాష్ట్రం ఆర్థికరంగానికి వెన్నుముఖ అన్నారు. 25 లక్షల మందికిపైగా రైతుల రుణాలు(Farmers' Loans) మాఫీ చేశామని గవర్నర్ వెల్లడించారు.

ప్రజాప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా(Rythu Bharosa) అందిస్తోందని చెప్పారు. వ్యవసయాకూలీలకు ఇందిరమ్మ ఆత్మయ భరోసా ఇవ్వనున్నామని వెల్లడించారు. సన్నరకం బియ్యానికి బోనస్ అందించామన్నారు. 2024 వానా కాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశామన్న ఆయన ఉచిత బస్సు రవాణాతో మహిళలకు రూ. 4,500 కోట్లు ఆదా చేశామన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నామని గవర్నర్ సూచించారు. యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ(Young India Skill University) నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. దావోస్ ఒప్పందాలతో రూ. 1.79 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. దావోస్ ఒప్పందాలతో 49,500 ఉద్యోగాలు వస్తాయన్నారు. అగ్రగామిగా రాష్ట్రం ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. ఆవిష్కరణల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని చెప్పారు. 200 ఎకరాల్లో ఏఐ(Artificial intelligence) నగరాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.