హైదరాబాద్: మహాత్మా గాంధీ వర్ధంతి(Mahatma Gandhi Vardhanthi ) సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్ హౌజ్‌లోని బాపూ ఘాట్(Bapu Ghat in Langar House)లో నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Legislative Assembly Speaker Gaddam Prasad Kumar), మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ తో పాటు పలువురు ప్రముఖులు మహాత్ముడికి నివాళులు అర్పించారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (Hyderabad Metropolitan Development Authority) అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. నగరంలో కీలకమైన అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల మెరుగుదలలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.