calender_icon.png 23 February, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ

23-02-2025 11:22:48 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ అధికారులను(IPS Officers) బదిలీ చేసింది. ఎనిమిది మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Telangana Government Chief Secretary Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో నేరాల అదనపు కమిషనర్‌గా విశ్వ ప్రసాద్‌, సైబరాబాద్‌లో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయెల్ డేవిస్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజరావు భూపాల్‌, సీఐడీ0 సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా బి. నవీన్ కుమార్‌, గవర్నర్‌కు అదనపు డిప్యూటీ కమిషనర్ (ఎడిసి)గా శ్రీకాంత్‌ నియమిస్తారు. సిఐడి ఎస్పీగా రాంరెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సిహెచ్ శ్రీధర్‌, హైదరాబాద్ ఎస్‌బి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి)గా చైతన్య కుమార్‌ నియమితులయ్యారు.

కాగా, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ క్యాడర్ కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులైన రోడ్‌ సేఫ్టీ డీజీగా పనిచేస్తున్న అంజనీకుమార్‌, రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అభిలాష బిస్త్‌ను తెలంగాణ ప్రభుత్వం వారిని రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.