01-04-2025 10:42:57 PM
సన్న బియ్యం పంపిణీ ప్రారంభం..
పిట్లం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కొరకు నూతనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఏఎంసి వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పేద ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యమని, సున్నితమైన బియ్యం ప్రజలకు పోషకాహార పరంగా ప్రయోజనకరం అని తెలిపారు. ఈ పథకంతో ఆహార భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడ్వకేట్ రామ్ రెడ్డి, శివ, శ్రీనివాస్ రెడ్డి, హ్యన్మాండ్లు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.