calender_icon.png 3 November, 2024 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమ్మర్లను పట్టించుకోండి!

02-11-2024 11:25:38 PM

కాలం ఎంత మారినా కుమ్మర్ల వృత్తి అవసరాలు మాత్రం సమాజానికి అవసరమవుతూనే ఉన్నాయి. అటు శుభ, ఇటు అశుభ కార్యాలలో ప్రత్యేకించి కుమ్మర్లు చేసిన కుండలు, గురుగులు తదితర పాత్రలనే వాడడం జరుగుతున్నది. కుమ్మరుల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి.  వారిని బీసీ ‘ఏ’ గ్రూపులో చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్నేళ్లుగా ఈ వృత్తిదారులపట్ల ప్రభుత్వాల నిరాదరణ ఒకవైపు, మార్కెట్లో సరసమైన ధరలు లభ్యం కాకపోవడం మరోవైపు వీరిని సమాజంలో అట్టడుగు స్థితికి చేరుస్తున్నది. తెలంగాణలో కుమ్మర్ల జనాభా సుమారు 14 లక్షలు ఉండగా, వీళ్లలో ఎనిమిది లక్షలమంది ఓటర్లు ఉన్నట్టు అంచనా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వీరంతా తమ వంతు పాత్రను పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత ప్రభుత్వంపై కుమ్మర్లు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఏడున్నర దశాబ్దాలలో వీరు రాజకీయంగానూ పెద్దగా ఎదిగింది లేదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కుమ్మర్లకు చట్టసభలకు వెళ్లడానికి టిక్కెట్లు కేటాయించాలి. ఆర్థికంగా కనీస స్థోమత లేనివారిని నామినేటెడ్ పదవుల్లోనైనా నియమించాలి. మొత్తంగా కుమ్మర్లకు న్యాయం చేసే దిశగా ఈ సామాజిక వర్గాన్ని బీసీ ‘ఏ’ గ్రూపులోకి చేర్చాలి. అప్పుడే వీరికి ఒకింత న్యాయం జరిగినట్టు అవుతుంది.

 నేదునూరి కనకయ్య, హైదరాబాద్