హైదరాబాద్,(విజయక్రాంతి): చైనా(China)లో హ్యూమన్ మెటానిమో వైరస్(Human Metapneumovirus) వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ముందు జాగ్రత్తగా అప్రమత్తమైంది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ప్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని సూచించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకైతే హెచ్ఎంపీవీ వైరస్(HMPV Virus) కేసులు నమోదు కాలేదని తెలిపింది. జలుబు, దగ్గ లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని, రద్దీ ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్ తో మీ చేతులను తరచుగా కడగాలని వైద్యశాఖ వెల్లడించింది.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్య వ్యక్తుల వద్దకు వెళ్లకూడదని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని మార్గదర్శకాలను తెలియజేసింది. తెలంగాణలో ఈ కొత్త వైరస్ తో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఇప్పటి వరకు హెచ్ఎంపీవీ కేసుల నమోదు కాలేదని శనివారం పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.బి. రవీంద్ర నాయక్(Public Health Family Welfare Director Dr. B. Ravindra Nayak) పేర్కొన్నారు. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 డిసెంబర్ లో శ్వాసకోస ఇన్ ఫెక్షన్ ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఏమీ లేదని ఆరోగ్యశాఖ నిర్ధారించింది. ఈ మేరకు మెటాప్‌న్యూమోవైరస్ వ్యాప్తి లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.