హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం(Telangana Rising delegation) దావోస్‌లో పర్యటిస్తోంది. తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు 'కంట్రోల్ ఎస్' (CtrlS) డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది.
ఈ ప్రాజెక్ట్ దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుఉందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందన్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దావోస్‌లో జరిగిన అవగాహన ఒప్పందాలపై సంతకాలపై రేవంత్‌రెడ్డి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబులు పర్యవేక్షించారు.
అటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) లో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్‌తో కీలక ఒప్పందం కుదిరింది. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ ఉత్పత్తి (Refining) కేంద్రం, మరో ప్రాంతంలో బాటిల్ క్యాప్‌లను తయారు చేసే యూనిట్‌ను నెలకొల్పడానికి యూనిలీవర్ ఒప్పందం చేసుకుంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పెట్టుబడులను పొందింది. రాష్ట్ర ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Megha Engineering & Infrastructures Limited)తో సుమారు రూ. 15,000 కోట్ల విలువైన మూడు ప్రధాన ఒప్పందాలను కుదుర్చుకుంది. తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.