మున్సిపల్ కౌన్సిలర్ డేమే యాదగిరి
రామాయంపేట,(విజయక్రాంతి): టీబీ వ్యాధిని సమూలంగా నిర్మూలించడo కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దేమే యాదగిరి తెలిపారు. 100 రోజుల కార్యచరణను చేపట్టుటకు రామాయంపేట పట్టణంలోని 6వ వార్డులో ప్రజలకు శుక్రవారం రోజున టెస్టులు నిర్వహించి, శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించే కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ దెమే యాదగిరి ప్రారంభించడం జరిగింది. టీబీ వ్యాధి గ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రత్యేకించి వైద్యరంగంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పాటుపడుతుందని యాదగిరి తెలిపారు. కార్యక్రమంలో టీబీ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారికి మందులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్, ఎంపీహెచ్ఏ రాజేంద్ర కుమార్, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు.