హైదరాబాద్: అలెగ్రో మైక్రో సిస్టమ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అలెగ్రో సెమీ కండక్టర్లకు సంబంధించి ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. 500 మందికి అలెగ్రో మైక్రో సిస్టమ్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఆ సంస్థ సీఈఓ వినీత్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎన్నో అనుకూల అంశాలున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.