22-03-2025 02:12:50 AM
ఖమ్మం, మార్చి 21 ( విజయక్రాంతి ):-తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా దొండపాటి రమేష్,కొండపర్తి గోవిందరావు తిరిగి ఎన్నికయ్యారు. వైరాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది. 19 మంది ఆఫీస్ బేరర్లు, 71 మంది జిల్లా కమిటీ సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా దొండపాటి రమేష్, గోవిందరావు లు మాట్లాడుతూ వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంఘం గౌరవాధ్యక్షులుగా ఏపూరి రవీంద్రబాబు, కార్యనిర్వహక అధ్యక్షునిగా కూచిపూడి రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జక్కుల రామారావు, ఉపాధ్యక్షులుగా అమరనేని వీరభద్రం, బానోత్ రాంకోటి, భాస్కర్, శ్రీనివాస్, పాసంగుల చందర్రావు, చావా మురళి, నల్లమోతు నర్సింహారావు లు ఎన్నికయ్యారు.
కార్యదర్శులుగా మిడికంటి వెంకటరెడ్డి, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఏలూరి భాస్కర్, బాగం ప్రసాద్, మందడపు రాణి, బానోత్ రవి, మామిడి సుదర్శన్రెడ్డి, పి. వెంకటనర్సయ్య, కోశాధికారిగా దొబ్బల వెంగళరావు ఎన్నికయ్యారు.