calender_icon.png 21 September, 2024 | 12:48 PM

ఈ - పాస్ పోర్టల్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కు దరఖాస్తులు

21-09-2024 10:26:49 AM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): మహిళ శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమం శాఖ (e - pass) పోర్టల్ ను ఓపెన్ చేసి  చేసి దాని ద్వారా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందాలని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. 2024-25 సంవత్సరంకులగాను కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు తమ స్కాలర్షిప్ ను రెన్యువల్ చేసుకోదలుచుకున్న అర్హులైన (దివ్యంగా) విద్యార్థిని విద్యార్థులు తమ దరఖాస్తులను ఓపెన్ చేయబడిన ఈ పాస్ పోర్టల్ వెబ్సైట్ https://telanganaepass.cgg.gov.in నందు ఆన్లైన్ ద్వారా స్కాలర్షిప్ పొందుటకు గాను తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఇట్టి అవకాశము జిల్లాలోని అర్హులైన దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులందరూ ఉపయోగించుకుని కింద సూచించబడిన తేదీలలో దరఖాస్తు చేసుకున్న వలసిందిగా జిల్లా సంక్షేమ అధికారి మహిళ శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమం యాదాద్రి భువనగిరి జిల్లా తెలియజేసినారు.  

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు 

ఓపెనింగ్ పోర్టల్.1st సెప్టెంబర్ 2024

అప్లికేషన్ సబ్మిషన్ చివరి తేదీ.31st డిసెంబర్ 2024