calender_icon.png 10 October, 2024 | 4:56 PM

మెడికల్ కళాశాలకు తెలంగాణ చిహ్నం లోగో మార్పు

10-10-2024 02:58:29 PM

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలగింపు

నాగర్ కర్నూల్ విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాల ప్రవేశం గేట్ వాల్ కు మెడికల్ కళాశాల యాజమాన్యం తెలంగాణ చిహ్నం లోగోను మార్చి నూతన లోగోను ఏర్పాటు చేయడంతో విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా చిహ్నాన్ని విడుదల చేయకపోయినా మెడికల్ కళాశాల యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కొత్త లోగో ప్రదర్శించడంతో స్థానికులు ప్రజలు విమర్శిస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న అనంతరం టిఆర్ఎస్ ప్రభుత్వం చార్మినార్, కాకతీయ కళాతోరణం వంటి వాటితో పాటు తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వ చిహ్నాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాగా పదేళ్లు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారిక చిహ్నంలో తెలంగాణ అమరవీరులకు అన్యాయం జరిగిందంటూ పాత చిహ్నాన్ని మార్చేందుకు యోచించింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు రావడంతో నూతన చిహ్నం కోసం వినతులను స్వీకరించింది. అప్పటివరకు అధికారిక చిహ్నం ప్రకటన వాయిదా వేశారు. కానీ నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల యాజమాన్యం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ప్రతిపాదించిన చిహ్నాన్ని కళాశాల స్వాగత గేట్ వాల్ కు ప్రదర్శించడం ప్రస్తుతం చర్చనీ అంశమైంది. ఈ అంశంలో  సోషల్ మీడియాలో వీడియోను పోస్టర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో ఆలస్యంగా తేర్కొని ఏర్పాటు చేసిన నూతన చిహ్నం లోగోను తొలగించారు.