calender_icon.png 27 December, 2024 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో ప్రారంభం కానున్న డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్

15-10-2024 02:06:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యను నిపుణులు తాజాగా పరిష్కరించడంతో తిరిగి కౌన్సెలింగ్ ప్రయను చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్ ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. .  కౌన్సెలింగ్ కు ఇవాళ ఉదయం వచ్చిన అభ్యర్థులు వెనుదిరిగి పోవడంతో డీఈవోలు మళ్లి సమాచారం అందజేసి రప్పిస్తున్నారు.