calender_icon.png 31 October, 2024 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు తెలంగాణ బృందం

31-10-2024 01:55:09 AM

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): నవంబర్ 3 నుంచి 8 వరకు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ సద స్సు (సీపీసీ)కి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జీ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు హాజ రవ్వనున్నారు.

ఇండియా సహా అనేక కామన్వెల్త్ దేశాలకు సీపీసీకి ఆహ్వానాలు అందాయి. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా చట్టసభల పనితీరుపై చర్చిస్తారు. ఇదే వేదికపై 8వ ఉమెన్ పార్లమెంటేరియన్స్ సదస్సు సైతం జరుగనుంది. 

ఇక్కడే 2024 కామన్వెల్త్ పార్లమెంటేరియన్ అవార్డులను సైతం ప్రదానం చేస్తారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ బృందం ఈ నెల 2వ తేదీన సిడ్నీ చేరుకుంటుంది. సదస్సు అనంతరం యూరప్ పర్యటనకు వెళ్లి నవంబర్ 16న రాష్ట్రానికి చేరుకుంటారు.