calender_icon.png 28 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఇక నీ జీవితం ఫామ్ హౌస్కే అంకితం

28-04-2025 06:57:58 PM

విమర్శలు గుప్పించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ...

పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం.. 

పినపాక (విజయక్రాంతి): వరంగల్ ఎల్కతుర్తిలో కేసిఆర్ నిర్వహించేది రజతోత్సవ సభ కాదని, అది గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కేసిఆర్ చేసిన మోసాలను కప్పిపుచ్చుకునే కుతంత్రోత్సవ సభని.. పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలించిన తొమ్మిది సంవత్సరాలు కాలం రావణాసురుడి పాలన సాగించాడని, కూతురు, కొడుకు, అల్లుడుకే పదవుల పట్టం కట్టాడని, కేసిఆర్ ని మించిన పనికిమాలిన ముఖ్యమంత్రిని చరిత్రలోనే చూడలేదని గొడిశాల దుయ్యబట్టారు.

వరంగల్ సభకు 10 లక్షల మంది హాజరవుతున్నారు అని చెబుతున్న కేసిఆర్, ఈ సభ ఏర్పాట్లకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ప్రశ్నించారు. కట్టిన సంవత్సరం కాలంలోనే కుంగిన కాలేశ్వరం, కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకున్నా రన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సమాధిలో కూరుకుపోతుందని, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బసీరుద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వతంత్ర రెడ్డి, కొంపెల్లి నాగేష్, మనోజ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.