17-04-2025 08:39:28 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మంగళవారం జపాన్‌లో ఏడు రోజుల పర్యటన ప్రారంభించారు. అక్కడ ఆయన తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ బహుళజాతి కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల ప్రతినిధులను కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం బృందం నేడు జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది. సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ ఇండస్ట్రీ సంస్థలతో భేటీ కానుంది. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సీఎం బృందం సందర్శించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి జపాన్(Telangana CM Japan tour)లో ఘన స్వాగతం లభించించి. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో జపాన్‌లోని భారత రాయబారి శిబు జార్జ్ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని స్వాగతించి, వారికి ఘనంగా విందు ఇచ్చారు. జపాన్ లోని భారత రాయబారితో ముఖ్యమంత్రి సమకాలీన అంశాలపై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ఎంపీ కనిమొళి కరుణానిధి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ నెపోలియన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.