హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Anumula Revanth Reddy) హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ ప్రస్థానం ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఏడాది శుభ సంతోషాలను నింపాలని కోరుకున్నారు. కొత్త సంవత్సరం(Happy New Year 2025 ) తెలంగాణ ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తుందన్నారు. కుల సర్వే నివేదిక విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వ కీలక వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. ఎస్సీ వర్గీకరణ నివేదిక 2025లో విడుదల కానుందన్న సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌పై నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు. అవసరమైన వారికి కొత్త రేషన్‌కార్డులు(New Ration Cards) మంజూరు చేస్తామన్నారు. రైతు భరోసా పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది.