calender_icon.png 20 January, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎం సందడి

20-01-2025 03:54:18 PM

హైదరాబాద్: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy)కి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు అభినందనలు తెలియజేశారు. జ్యూరిచ్ విమానాశ్రయం(Zurich Airport)లో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Andhra Pradesh Chief Minister Chandrababu) పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి  రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu), మంత్రి శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. దావోస్ సదస్సు(Davos 2025 World Economic Forum Summit) తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది.