calender_icon.png 5 February, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ

19-01-2025 12:00:00 AM

రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే బలమైన ఆర్థిక పునాదులుం డాలనే దృఢమైన సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెండడమే కాకుండా ప్రధానంగా ఉపాధి రంగం కూడా మెరుగుపడే అవకాశాలుండడంతో ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతం అవుతున్నాయి.

తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఏడాది కాలంగా తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటీ సఫలీకృతం కావడం అభినందనీయం. ఇప్పటికే అన్ని రంగాలను ఆకర్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పుడు ‘ఫ్యూచర్ సీటీ’ పేరుతో పెట్టుబడులకు కేం ద్రంగా మారుతోంది. పెట్టుబడులను, అభివృద్ధిని ఒక్క హైదరాబాద్ మహానగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా ప్రొత్సాహించేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక నినాదమైన నిధులు, నియామకాలు, నీళ్లు ఆశయాలు రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయినా ఆశించిన మేరకు నెరవేరలేదు. ఈ నినాదంలో నిధులు, నియామ కాల ఆశయాలు అందుకోవడానికి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావాల్సిన ఆవశ్యకత గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మొదటి ఏడాది పాలనలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ఫలాలు ఇప్పుడు కనిపిస్తు న్నాయి.

ప్రపంచ ఆర్థిక వేదికైన దావోస్‌లో గతేడాది జరిగిన వార్షిక సదస్సును తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా మల్చు కుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో తెలంగాణకు రూ.40,233 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఈ నేపథ్యంలో సోమవారం నుండి దావోస్‌లో జరగనున్న ఈ ఏడాది వార్షిక సదస్సులో పాల్గొంటున్న సీఎం నేతృత్వంలోని బృందం తెలంగాణకు మరిన్ని పెట్టు బడులు తీసుకొచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.

కార్యరూపం దాలుస్తున్న  ఒప్పందాలు

పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకొని చేతులు దులుపుకోకుండా, పరిశ్ర మల ఏర్పాటుకు  రేవంత్ సర్కార్ గట్టి పట్టుదలతో రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం కల్పించడంతో గతేడాది దా వోస్‌లో జరిగిన సమావేశంలో 14 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చు కున్న ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి. ఈ కంపెనీలు 18 ప్రాజెక్టుల ఏ ర్పాటుకు ముందుకురాగా, వాటిల్లో 17 పనులు ప్రారంభమై, అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ 17 పనులలో 10 ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతూ ముగింపులో ఉన్నాయి.

వీటిలో అదానీ సంస్థలకు సంబంధించి... మామిడిపల్లి హార్డ్‌వేర్ పార్కులో ‘మిస్సైల్ షెల్ మాన్యుఫాక్చరింగ్’ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. రామన్నపేటలో సిమెంట్ గ్రైం డింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియ సాగుతోంది. చందన్‌పల్లిలో డేటా సెంటర్ కో సం భూ కేటాయింపులు పూర్తయ్యాయి. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీని విడుదల చేసిన నేపథ్యంలో 5 వేల మెగావాట్ల పం ప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

పరిశ్రమల ఏర్పాటుకు కీలకమైన భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. జేఎస్‌డబ్ల్యు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు భూకేటాయింపునకు రంగం సిద్ధమైంది. వెబ్‌వర్క్స్ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఫేజ్1 నిర్మాణం పూర్తయ్యింది. గోద్రేజ్ ఫామ్ సీడ్ గార్డెన్ ఖమ్మంలో ఏర్పాటవుతోంది. టాటా టెక్నాలజీస్ తొలిదశలో 30 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు త్వరలో అందు బాటులోకి రానున్నాయి. బీఎల్ అగ్రో అయిల్ రిఫైనరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 4 జిల్లాల్లో స్థలాల పరిశీలన పూర్తయ్యింది.

ఫార్మా రంగంలో ఇప్పటికే పేరుగాంచిన హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా మరిన్ని ఫార్మా కంపెనీలు రానున్నాయి. ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ యూనిట్ పనులు సూర్యాపేటలో పురోగతిలో ఉన్నాయి. గోడీ ఎనర్జీ సంస్థ లిథియం బ్యాటరీల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఆరాజైన్ లైఫ్ సైన్సె స్ సంస్థ మల్లాపూర్‌లో ఆర్‌అండ్‌డీ యూ నిట్‌ను ఏర్పాటు చేయనుంది.

క్యూసెంట్రియా ఐటీ కంపెనీ టెక్నాలజీ సెంటర్, సిస్ట్రా కంపెనీ న్యూ డిజిటల్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఓ9 సొల్యూషన్‌కు చెందిన సప్లై చైన్ స్కిల్లింగ్ అకాడమీ కోర్సు ను ప్రారంభించింది. హైదరాబాద్ నగరం లో ఇప్పటికే 5060 బస్సులను నడుపుతున్న ఊబర్ సంస్థ త్వరలో పూర్తి స్థాయి లో బస్సులను ప్రారంభించనుంది. రాష్ట్రం లో పరిశ్రమల ఏర్పాటును ప్రొత్సహించడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కీలక నిర్ణయాలు తీసు కుంటోంది.

ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్ సిటీ

రాష్ట్రంలో ఐటీ సంస్థలు, పరిశ్రమలను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం గ్రేటర్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు తోడుగా ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో నాలుగో సిటీని రూపొందిస్తోంది. 30 వేల ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ ఫ్యూచర్ సిటీ లో రైతుల అంగీకారంతోనే భూములను సేకరించి వారికి నష్టం జరగకుండా మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు కోల్పోతున్న భూమి విలువకు సమానంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను వారికివ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడంతో అన్నదాతలు కూడా ఆనందంగా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూములను పరిశీలించిన ప్రభుత్వం 6 మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం వెయ్యి ఎకరాల భూ సేకరణపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఈ నాలుగో నగరంలో ఐటీ అభివృద్ధితో పాటు యాపిల్ ఫోన్ విడిభాగాల పరిశ్రమ, ఎలక్ట్రిక్ ఈవీ బస్సుల తయారీ యూనిట్, టెక్సెటైల్ పరిశ్రమలకు ప్రాధాన్యతిస్తున్నారు.

ఇక్కడ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, వినోద కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు రేస్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. గతంలో పరిశ్రమల కోసం భూములు తీసుకొని పనులు ప్రారంభించకపోవడం తో ఆ స్థలాలను వెనక్కి తీసుకునేలా ప్రభు త్వం నియమ నిబంధనలను రూపొందిస్తుండడంతో పెట్టుబడి పేరుతో  భూఅ క్రమాల కట్టడికి అవకాశాలు ఏర్పడ్డాయి.

కాలుష్య రహితానికే పెద్దపీట

పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర  ప్రభుత్వం భూసేకరణతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధానంగా ఫార్మా కంపెనీలతో కాలుష్య ముప్పు రాకుండా చర్యలు చేపట్టింది. ఫ్యూచర్ సిటీలో ఫార్మా కంపెనీలకు కాలుష్య రహిత హామీతోనే భూములను కేటాయించాలని నిర్ణయించడం స్వాగతించాల్సిన అంశం. కాలుష్యం లేకుండా పరి శోధన చేసే సంస్థలకు, బయటనుండి ము డి సరుకు తీసుకొచ్చి ఔషధాలు తయారు చేసే సంస్థలకే స్థలాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో భూములివ్వడానికి స్థానికులు సానుకూలంగా ముందుకొస్తున్నా రు.

పెట్టుబడులతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్లతో 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు తో మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే పట్టుదలతో ఉంది. పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో భూములు కో ల్పోయిన వారితో పాటు స్థానికులకు ప్రా ధాన్యతిచ్చేలా చర్యలు తీసుకుంటోంది.  రేవంత్ సర్కార్ రాష్ట్ర పురోగతి కోసం గతేడాది వలే ఈ సారి కూడా దావోస్ సమా వేశాలను విజయవంతంగా సద్వినియోగపర్చుకోవాలని ఆశిద్దాం.