calender_icon.png 8 January, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

04-01-2025 06:18:27 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం ప్రారంభమయ్యింది. రైతులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న  రైతు భరోసా విధివిధానాలను కేబినెట్ ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులకు రైతుభరోసా కింద ఒక్కో సీజన్ లో ఎకరానికి రూ.7500 చొప్పున రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో నిధుల కొరతతో ఏడాదికి రూ.12 వేల చొప్పున ఎకరానికి ఇచ్చే నిర్ణయం ప్రకటించే అవకాశముంది. భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12 వేల భృతిని ప్రకటించనున్నారు. ఈ ఆర్థిక సాయం రెండు విడుతల్లో పేదలకు రూ.6 వేల చొప్పున పంపిణీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డులు,  సన్నబియ్యం పంపిణీ, టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణ, సమగ్ర కులగణనపై కేబినెట్ లో చర్చించనున్నట్లు సమాచారం.