హైదరాబాద్ : ఈనెల 18వ తేదీన
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎపి, తెలంగాణకు మధ్య
అపరిష్కృతమైన అంశాలపై చర్చించానున్నారు. ఎపికి కేటాయించిన భవనాలను జూన్ 2వ తేదీ తరువాత
స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్
అంశాలపై చర్చించి సమగ్ర నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచించారు. రైతు రుణమాఫీ,
ధాన్యం కొనుగోళ్లపై, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినేట్
భేటిలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమీక్షకు మంత్రులు పోంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్
కుమార్, తదితరులు హాజకానున్నారు.