19-03-2025 10:57:31 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 11.06 గంటలకు అసెంబ్లీ ముందుకు 2025-26 వార్షిక బడ్జెట్ రానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సర వార్షిక బడ్జెట్ రూ. 2.9 లక్షల కోట్లు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.