calender_icon.png 19 March, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లు

19-03-2025 12:33:57 PM

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) బుధవారం శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,04,965 కోట్ల బడ్జెట్‌(Telangana budget2025-26 )ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం కోసం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం కోసం రూ. 36,504 కోట్లు కేటాయించారు. "తెలంగాణను 10 సంవత్సరాలలో 1,000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు" అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు,  చేయూత కింద పెన్షన్ పంపిణీ వంటి అనేక పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారన్న భట్టి విక్రమార్క ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం, తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రతి చర్యను నిందిస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుత ధరల  ప్రకారం జీఎస్ డీపీ రూ. 16,12,579 కోట్లు, గతేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 10.1 శాతం నమోదు, జీఎస్ డీపీ వృద్ధిరేటు జీడీపీ వృద్ధిరేటు కంటే ఎక్కువ అన్నారు. జీఎస్ డీపీ వృద్ధి రేటు 10.1 శాతం, జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం ఉందన్నారు. దేశ జీడీపీ రూ. 3,31,03,215 కోట్లు. 2024-25 ఏడాది తలసరి ఆదాయం రూ. 3,79,751. రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి రేటు 9.6 శాతం, దేశ తలసరి ఆదాయం రూ. 2,05,579 కోట్లు, దేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు 8.8 శాతం, దేశ తలసరి ఆదాయానికి రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 శాతంగా ఉందని చెప్పారు.

రాష్ట్ర సొంత పన్నుల రాబడి అంచనా రూ. 1,45,419 కోట్లు, బడ్జెట్ లో ప్రతిపాదించిన రుణాలు రూ, 69,639 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ. 29,899 కోట్లు, పన్నేతర ఆదాయం అంచనా రూ. 31,618 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల అంచనా రూ.22,782 కోట్లు, ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ. 5,04,184 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1గా అంచనా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ. 19,087 కోట్లు, ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ. 27,623 కోట్లు, అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ. 37,463 కోట్లు. వాహనాలపై పన్ను ఆదాయం అంచనా రూ.8,535 కోట్లు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.