19-03-2025 11:25:07 AM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) బుధవారం వార్షిక బడ్జెట్(Telangana Budget ) 2025-26 ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం, తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రతి చర్యను నిందిస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.