12-03-2025 02:48:28 PM
ఈ నెల 19న అసెంబ్లీలో బడ్జెట్
27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) మార్చి 27 వరకు కొనసాగుతాయి. బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‌లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 19న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బీసీ రిజర్వేషన్(BC Reservation), ఎస్సీ వర్గీకరణ బిల్లులను మార్చి 17, 18 తేదీల్లో ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. ఈ నెల 14న హోలీ పండగ(Holi Festival) సందర్భంగా అసెంబ్లీకి సెలవు. ఈనెల 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చించనున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం(Congress Party Legislative Party meeting) కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల, బడ్జెట్ పద్దులు, కులగణన తదితర అంశాలపై సీఎల్పీలో చర్చ జరుగుతోంది.