calender_icon.png 20 September, 2024 | 10:56 PM

హైదరాబాద్‌కు వచ్చే నీటిని గజ్వేల్‌కు మళ్లించారు

27-07-2024 09:42:34 PM

హైదరాబాద్: ఏదైనా అభివృద్ధి చర్యలు ఫలాలు ఐదు, పదేళ్ల తర్వాత కనిపిస్తాయి. కానీ తమ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కు పెట్టుబడులు భారీగా వచ్చాయని బీఆర్ఎస్ చెప్పుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి వల్లే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చయని చెప్పారు. హైదరాబాద్ లో భారీ పరిశ్రమలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితాలు బీఆర్ఎస్ హయంలో కనిపించాయని ఆయన పేర్కొన్నారు. కృష్టానది, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్ కు రెండు విడతల్లో తాగునీటి పైపులైన్లు కాంగ్రెస్ ప్రభుత్వామే వేసిందని, కానీ హైదరాబాద్ కు వచ్చే పైపులైన్ కు రంధ్రం పెట్టి గజ్జేల్ కు నీరు తీసుకెళ్లారని  భట్టి  మండిపడ్డారు. ఓఆర్ఆర్ పై 30 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారని, బీఆర్ఎస్ దిగిపోయే ముందు ఓఆర్ఆర్ వేలం వేసుకుని ఆదాయం లేకుండా చేశారని మంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.