calender_icon.png 19 March, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో తెలంగాణ బడ్జెట్.. రూ. 3 లక్షల కోట్ల పైనే పద్దు?

19-03-2025 10:01:48 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Session) కొనసాగుతున్నాయి. నేడు ఉభయసభల్లో రాష్ట్రప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో అసెంబ్లీలో తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశం కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రజాభవన్ లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉపముఖ్యమంత్రి పూజలు చేశారు.

అనంతరం బడ్జెట్ ప్రతులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) శాసనసభకు చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు. ఈ బడ్జెట్ లో గ్యారెంటీలు, హామీల అమలు, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులు కేటాయింపులు చేసినట్లు సమాచారం. రాబడి పెంపు కార్యాచరణపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్(Telangana Budget-2025-26) మూడు లక్షల కోట్లు మార్కును అధిగమించే అవకాశముంది. గత సంవత్సరం వార్షిక బడ్జెట్ రూ. 2.9 లక్షల కోట్లు. తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్.