calender_icon.png 1 March, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బీసీ ఘటన బాధాకరం.. సీఎం వెళ్లకపోవడం దురదృష్టకరం: ఏలేటి

01-03-2025 11:17:55 AM

ఎల్ఎల్ బీసీ ఘటన బాధాకరం

హైదరాబాద్: బీజేపీ ప్రతినిధుల బృందం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(Telangana SLBC tunnel rescue) వద్దకు చేరుకుంది. భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఎమ్మెల్యేలు, నేతలు టన్నెల్ ను పరిశీలించారు. ప్రమాద ఘటన, టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల పరిస్థితిపై బృందం ఆరా తీయనుంది. టన్నెల్ ప్రమాదానానికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రాష్ట్ర బీజేపీ పట్టుబట్టింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటన బాధకరమని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) అన్నారు. ఘటనాస్థలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రులు పిక్నిక్ కు వెళ్లినట్లు వెళ్లారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్ఎల్ బీసీని నిర్లక్ష్యం చేశాయని ఏలేటి విమర్శించారు. కార్మికులు మరణిస్తే వారివి ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామని బీజేపీ వెల్లడించింది.