calender_icon.png 21 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ భవన్..తెలంగాణ జనతా గ్యారేజ్!

21-01-2025 12:12:37 AM

  • ఎప్పుడైనా వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు

రూ.1.40 లక్షల కోట్లు అప్పు చేసి ఏఒక్క పనైనా చేశారా?                                                                                             

సీఎంను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలి                                                                                  

బీఆర్‌ఎస్ కార్మిక విభాగం డైరీ ఆవిష్కరణలో కేటీఆర్

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): “తెలంగాణ భవన్ కాదిది.. తెలం గాణ జనతా గ్యారేజ్‌” అని ప్రజలు ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. సోమ వారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్మి క విభాగ డైరీ ఆవిష్కరణలో కేటీఆర్ మాట్లాడారు.. ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన ప్పుడు బడ్జెట్ ఎంత? ఆనాడు అప్పు ఎంత? ఆస్తులు ఎన్ని? అని ప్రశ్నించారు.

సంవత్సరానికి రూ.40 వేల కోట్ల అప్పుచేసి కేసీఆర్ ఎన్నో పనులు, పథకాలు, ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. “రూ.1.40లక్షల కోట్ల రూపాయల అప్పును ఒక్క ఏడాదిలోనే చేసి న రేవంత్‌రెడ్డి.. ఎక్కడైనా ఒక కొత్త ఇటికె అన్న పెట్టాడా? కొత్త పైప్ లైన్ వేశాడా? ఆడబిడ్డలకు  2,500 ఇచ్చిండా?” అని నిలదీశారు. ఇవన్నీ చేయకుండానే సంవత్సరం లోనే రూ.1.40 లక్షల కోట్లు అప్పు ఎలా చేశాడో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు ఒక్క మేలు చే యని రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మాత్రం మూటల్ని మోసే పనిని నిజాయితీగా చేశాడని ఎద్దేవా చేశారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని రాహుల్ గాంధీతో హామీ ఇప్పించారని, ఇప్పటికీ దాని గురించి అతీగతీ లేదన్నారు. 33 జిల్లాలకు బీఆర్‌ఎస్ కార్మిక విభాగానికి కొత్త కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు.  8,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటిదాకా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రాలేదని, పెన్షన్లు రావడం లేదని పీఆర్సీ అమలు చేయడంలేదని చెప్పారు.