12-02-2025 05:39:45 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకాస ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆటో డ్రైవర్ల ఐకాస ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్దమవుతోంది. ఈనెల 24వ తేదీన పార్టీలతో రాష్ట్రస్థాయి భేటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఐకాస కన్వీనర్ వెంకటేశం పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మందు ఆటో డ్రైవర్లకు అనేక సంక్షేమ పథకాలు తీసుకోస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. అధికారంలోకి రాగానే విస్మరించిందని ఆరోపించారు.
మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. గతంలో ఈ సమస్యలపై సమ్మెకు పిలుపునిస్తే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఇంటి పిలిపించి చర్చించినట్లు తెలిపారు. నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేలు ఇస్తామన్నారని, ఇప్పటికి ఆ పథకం అమలు చేయలేదని దుయ్యబట్టారు. అయితే వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేవారు.