28-03-2025 12:48:51 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget ) అద్బుతంగా జరిగాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. అందరు సభ్యులు మాట్లాడేందుకు అవకాశమిచ్చారని కూనంనేని తెలిపారు. గత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు అర్థవంతగా నిర్వహించారని కూనంనేని ఆరోపించారు. గత ప్రభుత్వం సభ్యులకు అవకాశం ఇచ్చేది కాదని ఆయన విమర్శించారు. గతంలో ప్రశ్నిస్తే మార్షల్స్ తో బయటకు పంపించేవారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూనంనేని సూచించారు. రూ. 2 లక్షల రుణమాఫీ అనేక మంది రైతులకు రాలేదని వెల్లడించారు. విలేకరుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని పిలుపునిచ్చారు.