18-03-2025 09:09:45 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Session) ఐదో రోజు కొనసాగనున్నాయి. మంగళవారం నాడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయబడ్డాయి. బిల్లులపై ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణ(SC Classification) హేతుబద్ధీకరణ బిల్లు, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ చట్టసవరణ బిల్లు, న్యాయవాదుల సంక్షేమం నిధి బిల్లు, అడ్వకేట్స్ క్లర్క్స్ వేల్ఫేర్ ఫండ్ బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తదితర బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం(State Govt) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.