calender_icon.png 11 January, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి.. మన్మోహన్

30-12-2024 11:40:02 AM

మన్మోహన్ సింగ్ ప్రతి పదవికి వన్నె తెచ్చారు

హైదరాబాద్: భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో కొనియాడారు. మన్మోహన్ సింగ్ మరణానంతరం సంతాప తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేలపై మానవతా ప్రమాణాలు వెదజల్లిన గొప్పవ్యక్తి మన్మోహన్ సింగ్  అన్నారు. మన్మోహన్ చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని ప్రపంచం ముందు బలమైన శక్తిగా నిలిపారని ఆయన విశేష సేవలను కొనియాడారు. 

దేశంలో అసమానతలు, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని చట్టాల ద్వారా ప్రజల్లో ధైర్యం నింపారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ నిర్ణయాలు పేదలను దారిద్య్రం నుంచి బయటపడేశాయని తెలిపారు. అతిసామాన్యుడు కూడా పాలనాపరమైన అంశాలు తెలుసుకునేలా 2005లో ఆర్టీఐ తెచ్చారు. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం(National Employment Guarantee Scheme) దేశ గతినే మార్చేసిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. మన్మోహన్‌ సింగ్ విగ్రహాన్నీ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని, భారత రత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా మద్ధతు తెలుపుతున్నామని విక్రమార్క వెల్లడించారు.