calender_icon.png 12 March, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

12-03-2025 10:39:18 AM

హైదరాబాద్: కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Budget Session 2025) ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. కేసీఆర్ కు (Bharat Rashtra Samithi) భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు.