calender_icon.png 17 March, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు తెలంగాణ శాసనసభ ముందుకు కీలక బిల్లులు

17-03-2025 08:49:41 AM

హైదరాబాద్: బిల్లులపై శాసనసభ, మండలిలో(Telangana Assembly Budget Session ) ఇవాళ, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల తో శాసనసభ ప్రారంభం అవుతోంది. సుప్రీం కోర్టు మేరకు ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించడంపై బిల్లు, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లను42 శాతానికి పెంపుపై బిల్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై బిల్లు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు(Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple Board) ఏర్పాటుపై బిల్లులపై సభలో చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ బిల్లులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రెండు బిల్లులపై శాసనసభ, మండలిలో ఇవాళ, రేపు ప్రత్యేక చర్చ పెట్టనున్నారు. శాసనసభలో 4 బిల్లులతో పాటు తెలుగువర్సిటీ చట్టసవరణ బిల్లుపై చర్చ జరగనుంది.

మెస్-డైట్ ఛార్జీల పెంపు, ట్రామా కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చించనున్నారు. విదేశీ ఉపకార వేతనాల్లో జాప్యం, పర్యాటకానికి ప్రోత్సాహంపై చర్చ జరగనుంది. ప్రభుత్వ వెబ్ సైట్లలో జీవోలు, హెచ్ఎండీఏ భూముల తాకట్టపై చర్చించనున్నారు. టీ ప్రైడ్ కింద రాయితీ అంశాలపై శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో చర్చ జరగనుంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంపునకు సామాజిక, ఆర్థిక కులసర్వే చేపట్టింది. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 25 శాతం, ముస్లింలకు  బీసీ-ఈ కింద 4 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అమలు(Government schemes), కాల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్ల, సీతారామ ఎత్తిపోతల, ఫార్మాసిటీ కోసం భూసేకరణ, విత్తనోత్పత్తి, వరికి బోనస్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, ధాన్యం సేకరణ, తమ్మిడిహట్టి ఆనకట్ట అంశాలపై పై మండలిలో చర్చించనున్నారు.