calender_icon.png 1 November, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో అసెంబ్లీ సమావేలు ప్రారంభం.. జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న సీఎం

02-08-2024 10:07:27 AM

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేడు సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది. సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లు, పబ్లిక్ సర్వీస్ నియామకాల నియంత్రణ బిల్లు. భూమి హక్కులు, సంస్కరణల, స్కిల్ యూనివర్సిటీ, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ సహా ఇతర బిల్లులపై సభలో చర్చించనున్నారు. కాగ్ నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నేడు జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. జాబ్ క్యాలెండర్ కు ప్రభుత్వం చట్టబద్ధత తీసుకువస్తామని సర్కార్ తెలిపింది. ఏటా నిర్దిష్ట కాలవ్యవధిలో నియామకాలు చేపట్టేలా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఉదయం10.30 గంటలకు మహీంద్ర వర్సిటీ స్నాతకోత్సవానికి సీఎం హాజరుకానున్నారు. మహీంద్ర వర్సిటీ నుంచి సీఎం నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎల్ బీ స్టేడియంలో జరిగే సభకు సీఎం హాజరుకాన్నారు. పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సభలో సీఎం పాల్గొనున్నారు.