calender_icon.png 7 February, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీసీసీ హబ్‌గా తెలంగాణ!

07-02-2025 01:44:54 AM

  1. ‘గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ పాలసీ’ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కసరత్తు
  2. ఇప్పటికే జీసీసీల కేంద్రంగా హైదరాబాద్
  3. గత ఐదేళ్లలో 30శాతం కంపెనీలను ఆకర్షించిన నగరం
  4. ప్రస్తుతం రాష్ట్రంలో 355 జీసీసీలు
  5. కొత్త విధానం ద్వారా వచ్చే ఐదేళ్లలో 500కు పెంపునకు ప్రణాళికలు
  6. ఇప్పటికే కొందరు స్టేక్ హోల్డర్స్ నుంచి ప్రతిపాదనల స్వీకరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): 2030నాటికి హైదరాబాద్‌ను గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)లకు హబ్ గా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత ఐదేళ్లలో భారత్‌లో ఏర్పాటైన జీసీసీల్లో 30శాతం తెలంగాణలోనే నెలకొల్పారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌ను సాంకేతిక శక్తిగా మార్చే ప్రయాణానికి తెలంగాణ నాయకత్వం వహించాలని భావిస్తోం ది.

ఇందుకోసం ప్రత్యేకంగా ‘జీసీసీ పాలసీ’ని  తెలంగాణ తీసుకురాబోతోంది. ఇప్ప టికే దీనికి సంబంధించిన కసరత్తును ప్రభు త్వం ప్రారంభించింది. (జీసీసీలు ప్రపంచవ్యాప్తంగా పనిచేసే బహుళజాతి సంస్థల ఆఫ్‌షోర్ యూనిట్లు.

ఈ కేంద్రాలు వాటి మాతృసంస్థలకు ఐటీ, ఫైనాన్స్, మానవ వనరులు, డేటా అనలిటిక్స్ వంటి వివిధ సహా య సహకారాలను అందిస్తాయి) ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన జీసీసీ సీఈవోల సమ్మిట్‌లో కొందరు స్టేక్‌హోల్డర్స్ నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ఐటీ, పరిశ్రమల శాఖ.. నూతన విధానం రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది.

పూర్తిస్థాయిలో మరికొన్ని సంస్థల నుంచి ప్రతిపాదనలను తీసుకొని.. వీలైనంత త్వరగా జీసీసీ విధానాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. వ్యూహా త్మకంగా వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు దేశాల ఆర్థికాభివృద్ధిలో గ్లోబ ల్ స్థాయిలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,800 జీసీసీలు ఉన్నాయి. వీటికి మార్కెట్ రెవెన్యూ 64.6 బిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 19లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

దేశంలో వారానికి ఒక జీసీసీ కేంద్రం ఏర్పాటవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమం లో 2030 నాటికి జీసీసీల మార్కెట్ సైజ్ పెంచాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లను ఆకర్షించాలని నిర్ణయించింది. అయితే అందులో మెజార్టీ వాటాను దక్కించుకోవాలని తెలంగాణ భావిస్తోంది. 

కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర

టెక్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇండస్ట్రీతోపాటు మ్యానుఫక్చరింగ్, కన్సల్టింగ్, హెల్త్‌కేర్, బయోటెక్ రంగాల్లోని ప్రముఖ కంపెనీలను ఆకర్షించాలన్న లక్ష్యంతో దేశం లోని పలు రాష్ట్రాలు జీసీసీ పాలసీని సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక గతేడాది జీసీసీ పాలసీని ఐదే ళ్ల ప్రణాళికతో ప్రకటించింది. తద్వారా దేశంలో జీసీసీ పాలసీని ప్రకటించిన మొదటి రాష్ట్రంగా నిలిచిం ది. ఉత్తర్‌ప్రదేశ్ కూడా ప్రత్యేక పాలసీని సిద్ధం చేస్తోంది.

ఇది కూడా తుదిదశకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణకు మరో పొరు గురాష్ట్రమైన మహారాష్ట్ర కూడా జీసీసీ విధానంపై తీవ్రమైన కసరత్తు చేస్తోంది. 2025లో కొత్త విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమం లో ఆయా రాష్ట్రాల కంటే ముందే వీలైనంత త్వరగా కొత్త పాలసీని ప్రకటించా లని తెలంగాణ సర్కారు భావిస్తోంది.

గత ఐదేళ్లలో జీసీసీలు ఎందుకు పెరిగాయంటే..

గత ఐదేళ్లలో దేశంలో కొత్తగా ఏర్పడిన జీసీసీల్లో 30శాతం తెలంగాణలోనే ఏర్పడ్డాయి. ఇందుకు బలమైన కారణాలు ఉ న్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణులు ఉం డటం ప్రధాన కారణం. నిపుణులను తయారుచేయడానికి ఐఐఐటీ, ఐఎస్‌బీ, ఓయూ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నా యి. ఇక్కడి నిపుణులకు బహుళ భాష సంస్తృతి ఉంది. అది గ్లోబల్ కంపెనీలను ప్రత్యేకంగా ఆకర్షించింది.

దీనికితోడు మెరుగైన మౌలిక సదుపాయాలు హైదరాబాద్ సొంతం. అనుకూ లమైన వాతావ రణం, ఉన్నతమైన జీవనవిధానం, ఇతర మహానగారాలతో పోల్చితే తక్కువ పొల్యుషన్ కూడా కంపెనీలను ఆకర్షించడానికి మరొక కారణం. గత ఐదేళ్లలో జీసీసీ కోసం అన్ని సదుపాయాలతో 4 మిలియన్ల చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్థలాన్ని ప్రభు త్వం అందుబాటులో ఉంచింది.

అంతేకాకుండా 90వేల మంది నిపుణులు అందు బాటులో ఉన్నారు. దీనికి తోడు టీహబ్, వీహబ్, టీఎస్‌ఐసీ వంటి సంస్థలు జీసీసీలను  ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిం చాయి. 50కంటే ఎక్కువ జీసీసీలు వీటీతో కలిసి పనిచేస్తుండటం గమనార్హం.

ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ వ్యూహం 

హైదరాబాద్‌ను జీసీసీ హబ్‌గా మార్చేందుకు ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ దోహద పడుతాయని ప్రభు త్వం భావిస్తోంది. గ్లోబల్ కంపెనీలకు అవసరమైన నిపుణులను తయారుచేసేందుకు ఇవి ఉపయోగపడుతాయని ఆశిస్తోంది. తద్వారా వచ్చే పదేళ్లలో హైదరాబాద్‌ను స్కిల్ హబ్‌గా కూడా మార్చాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోం ది. తెలంగాణలో ప్రస్తుతం 355 జీసీసీలు ఉన్నాయి.

వీటి విలువ 10మిలియన్ డాల ర్లు. ఇక్కడ 3లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు. కొత్త పాల సీ ద్వారా రానున్న ఐదేళ్లలో జీసీసీల సంఖ్యను 500లకు పెం చుకోవాలని చూస్తోంది. 100బిలియన్ డాలర్లల్లో మెజార్టీ వాటాను దక్కించుకోవాలని, ఉద్యోగాలను 10లక్షలకు పెంచుకోవాలన్న లక్ష్యంతో ప్రత్యేక పాలసీని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.