calender_icon.png 19 September, 2024 | 9:52 PM

అణిచివేతకు వ్యతిరేకంగా పుట్టిందే తెలంగాణ సాయుధ పోరాటం

17-09-2024 03:26:50 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నర్సింహ

సంగారెడ్డి, సెప్టెంబర్ 16(విజయక్రాంతి)/జహీరాబాద్ : హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాచరిక పరిపాలన, భూస్వామ్య పెత్తందారుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింహ తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ సోమవారం జహీరాబాద్ పట్టణం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసే పట్వారి, కరణం వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారన్నారు.

కరువు వచ్చి పంటలు పండకపోయిన సందర్భంలో శిస్తు కట్టలేని ప్రజల నుంచి భూములు బలవంతంగా తీసుకున్నారన్నారు. ఆధిపత్యం, అణచివేత నుంచి సాయుధ తిరుగుబాటుకు దారితీసిందన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి సీపీఐ కార్యదర్శి జలాలొద్ద్దీన్, జహీరాబాద్ డివిజన్ కార్యదర్శి నర్సింహులు, నాయకలు.. పూజ, ఆనంద్, చిరంజీవి, అశోక్, రాము, దత్తురెడ్డి, ఆనంద్, సుధాకర్, విశ్వనాధ్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.