04-04-2025 12:30:47 AM
ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు
మెదక్, ఏప్రిల్ 3(విజయ క్రాంతి)సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని, ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు కొనియాడారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య 98 వ జయంతోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వెట్టిచాకిరి, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా చేసిన సాయుధ పోరాటంలో తొలి అమరుడైన ఆయన నిజాం నిరంకుశపాలనపై కూడా పోరాటం సలిపినాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు నర్సింహులు, జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి శాఖ సిబ్బంది తాళ్ళపల్లి శ్రీనివాస్, భానుప్రకాష్, నర్సింహులు, ఆరీఫ్, వసతి గృహా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.