calender_icon.png 21 September, 2024 | 12:01 PM

నిజాం సర్కార్ తలవంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం

16-09-2024 12:18:37 PM

సీపీఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యురాలు నళిని రెడ్డి 

ఆదిలాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ రైతంగ సాయుధ పోరాట 76వ వారోత్సవాలను సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లోని రాం నగర్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీపీఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా నళిని రెడ్డి మాట్లాడుతూ ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు ఆగడాలకు వ్యతిరేకంగా సీపీఐ పోరాటాలు చేసిందన్నారు. దున్నేవారికి భూమి కావాలని ఆ రోజుల్లో నైజాం సర్కార్, దేశ్ముకులు, భూస్వాములు తమ కభంద హస్తాల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను అనుభవిస్తూ పేదవాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న రోజుల్లో సీపీఐ పార్టీ పేద ప్రజల కు అండగా నిలుస్తూ పోరాటాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఆఖరికి నిజాం సర్కార్ పోరాటలకు లొంగకపోతే రవి నారాయణ రెడ్డి, ముగ్ధం మొయినోద్దీన్, బద్దం ఎల్లారెడ్డి లు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడంతో ప్రజలు భూస్వాములపై, నిజాం సర్కారుపై  పోరాటం చేస్తూ విజయం సాధించిన తర్వాత తెలంగాణ భారత దేశంలో విలీనం చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నాయకులు కుంటల రాములు, షేక్ పాషా, రమేష్ అమీనా బేగం, కాంతా బాయి, సుభాష్, ఆనంద్, కిషన్, నారాయణ, నరసింహులు, ఇస్సాఖాన్, మెహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.