calender_icon.png 21 September, 2024 | 10:51 PM

తెలంగాణ ఆణిముత్యం డాక్టర్ సినారె

28-07-2024 12:24:23 AM

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): సాహిత్యంలో అత్యున్నత పుర స్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్న మహాకవి, దివంగత సి నారాయణరెడ్డి (సినారె) తెలంగాణ ఆణిముత్యమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ సారస్వత పరిషత్‌లోని డా.దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరి గిన సినారె జయంతి వేడుకలో ప్రముఖ కవి డాక్టర్ యాకూబ్‌కు సినారె పురస్కారంతో పాటు రూ.25వేల నగదు, జ్ఞాపిక అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సినారె స్మృతిని పదిలపరిచేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సినారె పురస్కారం అందుకున్న డా.యాకూబ్ కవిగా, తెలుగు అధ్యాపకుడిగా చేసిన సేవలు అభినందనీయమని చెప్పారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య శివారెడ్డి, పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్. చెన్నయ్య, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న, ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముదిగంటి సుజాతరెడ్డి, పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.