calender_icon.png 15 January, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్‌డీపీలో తెలంగాణ అదుర్స్

05-09-2024 01:10:27 AM

9.2 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే టాప్

జాతీయ వృద్ధిరేటు 8.2% మాత్రమే..

2024-25 తొలి ఆరు నెలల్లోనే జాతీయ సగటును దాటిన వైనం

సేవలు, పారిశ్రామిక రంగంలో ప్రగతి

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): వాస్తవ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో తెలంగాణ దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవ త్సరం మొదటి అర్ధభాగంలో 9.2 వృద్ధి రేటును సాధించినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నారు. కేంద్ర గణాంకాల శాఖ సెప్టెంబర్ 1వ తేదీన వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ ఏడాది వృద్ధి రేటులో తెలంగాణ అత్యత్తమ ప్రదర్శనను కనబర్చింది.

జాతీయ వృద్ధిరేటు 8.2 ఉండగా.. తెలంగాణ 9.2 వృద్ధిరేటు నమోదు చేయడం గమనార్హం. వాస్తవానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు కంటే.. రాష్ట్ర వృద్ధిరేటు 0.2 శాతం తక్కువ నమోదైంది. 2024-25లో ఆరు నెలలు గడిచేసరికి జాతీయ వృద్ధి రేటు కంటే.. తెలంగాణ జీఎస్‌డీపీ ఏకంగా 1.0 శాతం ఎక్కువ నమోదు కావడం విశేషం. 

సేవల రంగంలో భేష్

ఈ ఆరు నెలల కాలంలో వృద్ధిరేటు అమాంతం పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. జీడీపీ వృద్ధిరేటులో కీలకమైన గ్రాస్ వ్యాల్యూ ఆడెడ్ (జీవీఏ)లో తమిళనాడు వాటా 53 శాతం. జీవీఏలో సేవలు, తయారీ, తదితర ఉత్పత్తి రంగాలు ఉంటాయి. జీవీఏలో అతిపెద్ద వాటాదారు అయిన తమిళనాడు సేవల రంగం వాటా 9 శాతం కాగా.. తెలంగాణ 11 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. తయారీ, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా ఆశాజనంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పారిశ్రామిక రంగం కూడా చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. ముఖ్యంగా విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులు, ఐటీ, బయోటెక్నాలజీ రంగాలు గణనీయమైన వృద్ధి రేటును సాధించడంలో దోహదపడ్డాయి.

అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి 

దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ అతిపెద్ద 8వ ఆర్థిక శక్తిగా ఉన్నది. 2023-24 నాటికి భారత్ 3.94 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇందులో మహారాష్ట్ర అగ్రస్థానంలో 69.08 బిలియల్ డాలర్లతో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. రెండో స్థానంలో తమిళనాడు, మూడోస్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో గుజరాత్, ఐదో స్థానంలో ఉత్తరప్రదేశ్, ఆరో స్థానంలో పశ్చి మ బెంగాల్, ఏడో స్థానంలో రాజస్థాన్ ఉండగా.. 8వ స్థానంలో 7.77 బిలియల్ డాలర్లతో తెలంగాణ నిలిచింది.

తొమ్మిదో స్థానంలో 888 మిలియన్ డాలర్లతో ఆంధ్రప్రదేశ్ ఉంది. వాస్తవానికి రాష్ట్ర జనాభాను బట్టి జీడీపీలో ఆ రాష్ట్ర వాటా ఉంటుంది. ఎక్కువ మంది జనాభా ఉంటే.. వాటా ఎక్కు వ ఉంటుంది. తక్కువ జనభా ఉంటే.. తక్కు వ ఉంటుంది. కానీ తెలంగాణ అంచనాలను మించిపోయి జీఎస్‌డీపీలో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెల ల్లో గ్రోత్ రేటులో అగ్రస్థానంలో నిలిచింది.