calender_icon.png 24 September, 2024 | 6:52 AM

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలి

24-09-2024 02:27:19 AM

ప్రభుత్వానికి గ్రూప్ విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహా లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పా టు చేయాలని తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షు డు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడు తూ.. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై అధ్యయనానికి ఆరుగురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసిందని, ఇప్పటికీ ఆ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొర త దృష్ట్యా ప్రతిభావంతులైన గ్రూప్ అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, స్థానిక సంస్థల్లో అనుభవం ఉన్న గ్రూప్ అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా నియమింయాలని ఆయన కోరారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని అతిత్వరలోనే కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ నాయ కులు వేణుమాధవ్ రెడ్డి, సయ్యద్ యాసీన్ ఖురేషి, అలోక్ కుమార్, అంజన్‌రావు, భవానీ, శశిశ్రీ తదితరులు పాల్గొన్నారు.