21-04-2025 09:31:52 PM
బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ
మునుగోడు,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నఉద్యమకారులను ఆదుకోకుండా, అవమానాలు,ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉద్యమకారులకు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యమకారుల కుటుంబాలకు కేసుల పాలై ఎంతో ఇబ్బందుల గురయ్యారు వాళ్లకు తెలంగాణ ఉద్యమకారుల కు గౌరవేతనంగా ప్రతి నెల 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజువ్ యువ వికాస్ లోన్ లో మొదటి స్థానంలో తెలంగాణ ఉద్యమకారుల ఇవ్వాలని కోరారు.