ఇంకెన్నాళ్లు ఈ కష్టాలని ఆవేదన
మహబూబ్‌నగర్, నవంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో మహబూబ్‌నగర్ జిల్లాలోని 28 మంది ఉద్యమకారులు పాల్గొనగా.. అప్పటి ఆంధ్రపాలకులు కేసులు నమోదు చేశారు. 2022లో తెలంగాణ పోలీసులు చార్జ్‌షీట్ వేయడంతో 28 మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కోర్టుకు 17 మంది హాజరయ్యారు. ఈ కేసును డిసెంబర్ 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం చేసిన ఆందోళనల్లో నమోదైన కేసులను ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. స్వరాష్ట్రంలోనూ ఇంకా ఎన్నాళ్లు తమకు ఈ కష్టాలని ఆవేద వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర కల సాకారం అయితే సంతోషంగా జీవనం సాగిస్తామని అనుకుంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు.