calender_icon.png 25 October, 2024 | 4:00 AM

ఉద్యమకారులకు దక్కని గౌరవం!

30-05-2024 12:05:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి : తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్ర మే పరిష్కారమని, రాష్ట్ర సాధానకై పోరా టం తప్పదనే భావన తెలంగాణ యువతలో అంకురించింది. అలా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణ రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969, జనవరి 9న కొత్తగూడెం పాల్వంచలో మొదలైంది. తొలిదశలో పెద్దమను షుల ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి అని ఉద్యమకారులు కొలిశెట్టి రాందాస్, కోలాహలం రాజు, కామా జాన్.. ఇంకా ఉద్యమకారులు ఆలోచిస్తున్న క్రమంలో పాల్వంచ కేటీపీఎస్ నుంచి ఉద్యమం మొదలు కావాలని పోటు కృష్ణమూర్తి సలహా ఇచ్చారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని గట్టాయిగూడెంకు చెందిన పోటు సోమయ్య, తులశమ్మల కుమారుడు కృష్ణమూర్తి. తన విద్యాభ్యాసం పూర్తికాగానే స్థానికంగా ఉన్న కేటీపీఎస్ కర్మాగారంలో 1968లో హెల్పర్‌గా ఉద్యోగం సంపాదించారు. 1968 చివరిలో పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయాలని పోరాటం చేయడానికి ఆనాటి పోరాట యోధులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆలోచించారు. ఈ ప్రాంతానికి చెందిన యోధులు రాందాస్, రాజు, కామాజాన్‌లు తమ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ఏకైక వ్యక్తి కేటీపీస్ కార్మికుడు పోటు కృష్ణమూర్తి అని భావించారు. దీంతో 1969 జనవరి 10 పోటు కృష్ణమూర్తి నాయకత్వంలో కేటీపీఎస్ కర్మాగారంలోని ఆంధ్రా అధికారులను వెనక్కి పంపాలని, తెలంగాణకు చెందిన వారే కర్మాగారంలో ఉద్యోగాల్లో కొనసాగాలని, పెద్ద మనుషుల ఒప్పందం అమ లు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీపీఎస్ కర్మాగారం ఎదుట ఆమరణ నిరహారదీక్ష చేపట్టారు. దీంతో ప్రాంతీయ వాదంతో ఉన్న తెలంగాణ వాదులు, స్థానికులు, కార్మికులు, ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులు ఆయనకు మద్దతు పలికారు. దీ

క్ష ప్రభావం స్థానిక కార్మికులపై పడటంతో కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోని ఆంధ్రా అధికారులకు నిరసన సెగ తగిలింది. వారి ఇళ్లపై  దాడులు ప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి ఎపీఎస్‌ఈబీ యాజమాన్యం ఆలోచనలో పడింది. అలా ఉద్యమం క్రమంగా కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మం ప్రాంతాలకు విస్తరించడంతో సర్కారు చిక్కుల్లో పడింది. ప్రత్యామ్నాయం కన్పించక పోవడంతో నార్త్ ఇండియాలో స్థిరప డిన ఓ ప్రముఖ వైద్యున్ని హుటాహుటిన ప్రభుత్వం తరుపున పంపి కృష్ణమూర్తి సంప్రదింపులు జరిపారు. ఆంధ్రాకు చెందిన అధికారులను తక్షణమే వారి స్వరాష్ట్రానికి పంపిస్తామని  హామి ఇవ్వడంతో 1969 జనవరి 23న దీక్ష విర మించారు.

ఈ పరిణామాలతో కేటీపీఎస్ కర్మాగారం నుంచి ఆంధ్రా అధికారులను పంపి తెలంగాణకు చెందిన వారిని యాజమాన్యం ఇక్కడికి బదిలీ చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పాల్వంచలో చోటు చేసుకొన్న పోరాటంపై దృష్టి సారించింది.  ఈ పోరాట స్ఫూర్తి తెలంగాణ ఉద్యమకారులను కదిలించింది. తొలిదశ  ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ప్రభుత్వం కాల్పులు జరపడంతో పోరా టం తీవ్రస్థాయికి చేరుకొంది. పెద్ద మనుషుల ఒప్పందం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఈ ఉద్యమంలోకి రాజకీయ నాయకులు ప్రవేశించడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే నినాదం వెలుగులోకి వచ్చింది. బలమైన ప్రాంతీయ వాదం మీడియా సహాకారం, రాజకీయ పార్టీలు, సకలజనుల పోరాటంతో జూన్ 2, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 

నాన్నకు దక్కని గౌవరం..

తెలంగాణ తొలి ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన పోటు కృష్ణమూర్తి తన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల మనుస్సుల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు నాడు విద్యుత్‌కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిగా, కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఇంతటి పోరాటం చేసిన నాయకుడి కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదు. అక్టోబర్ 25, 2014న కృష్ణమూర్తి మృతిచెందారు. అయినా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సి న సహాయం ఇప్పటికి రాలేదు. ఇంటిలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం, పారితోషికం కోసం కృష్ణమూర్తి కుమారుడు పోటు ప్రవీణ్ నేటికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ  తిరుగుతూనే ఉన్నాడు.